ఐపీఎల్‌ తర్వాత సంజూ శాంసన్‌ను మళ్లీ పక్కన పెట్టేస్తారా?

  • అఫ్గాన్‌తో సిరీస్‌కు సిద్ధమవుతున్న టీమ్‌ఇండియా
  • గిల్‌కు కెప్టెన్సీ పగ్గాలు వచ్చే ఛాన్స్‌
  • ఇషాన్‌ కిషన్‌ జట్టులోకి రీఎంట్రీ
  • మే 19న జట్టు ప్రకటన
ఐపీఎల్‌ ముగిసిన వెంటనే అఫ్గానిస్థాన్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. మే 31న ఐపీఎల్‌ ఫైనల్‌ ముగిసిన ఐదు రోజులకే ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. జూన్‌ 6న ముల్లాన్‌పూర్‌లో ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతుంది. తర్వాత మూడు వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి.

ఈ సిరీస్‌లో టీమ్‌ఇండియాకు శుభ్‌మన్‌ గిల్‌ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం. స్టార్‌ బౌలర్‌ బుమ్రాకు ఈ సిరీస్‌ నుంచి విశ్రాంతినిస్తారని తెలుస్తోంది. అయితే వన్డేల్లో వికెట్‌ కీపర్‌గా కేఎల్‌ రాహుల్‌ మొదటి ప్రాధాన్యంగా కనిపిస్తోంది. రెండో ఆప్షన్‌ కింద ఇషాన్‌ కిషన్‌ను టీమ్‌లోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ పేర్కొంది. 

టీ20 వరల్డ్‌ కప్‌ హీరో రిషభ్‌ పంత్‌ స్థానంలో ఫామ్‌లో ఉన్న ఇషాన్‌ కిషన్‌ను ఎంపిక చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నారని సమాచారం. అదే జరిగితే దాదాపు రెండేళ్ల తర్వాత వన్డే జట్టులోకి ఇషాన్‌ కిషన్‌ రీఎంట్రీ ఇచ్చినట్లు అవుతుంది. ఐపీఎల్‌ 2026లో ముంబై తరఫున కిషన్‌ 12 మ్యాచ్‌లో 420 రన్స్‌ చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

ఇదే జరిగితే టీ20 వరల్డ్‌ కప్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్‌కు వన్డే సిరీస్‌లో మళ్లీ నిరాశే ఎదురుకావడం ఖాయంగా కనిపిస్తోంది. సెలెక్టర్లు అతణ్ని పక్కన పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌ కోసం భారత జట్టును మే 19న బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ ప్రకటించనుంది. టెస్ట్‌ మ్యాచ్‌ ఆడే ఆటగాళ్లు సన్నద్ధం కావాలని బోర్డు ఇప్పటికే సందేశం పంపింది.

Sanju Samson
Afghanistan
India
ODI Series
Ishan Kishan
Shubman Gill
KL Rahul
T20 World Cup
BCCI
Indian Cricket Team

More Telugu News